ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 సినిమాల తో పాన్ ఇండియా బాక్సాఫీస్ ను అదరగొట్టాడు .. గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమాను సెన్సేషన్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించాడు .. దాదాపు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఇండియన్ సినిమాలోనే రికార్డు క్రియేట్ చేసింది .. అయితే ఎప్పుడు పుష్పా 2 తర్వాత అల్లు అర్జున్ తర్వాత సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగింది .. అయితే అల్లు అర్జున్ ఇప్పుడు స్టార్ దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది .


జవాన్ సినిమాతో అట్లీ భారీ విజయాన్ని అందుకున్నడు .. జవాన్ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది .. ఈ భారీ విజయం తర్వాత ఈ దర్శకుడు అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు .. అలాగే అల్లు అర్జున్ కోసం చాల పెద్ద కథతో రాబోతున్నట్టు తెలుస్తుంది .. తమిళ , హిందీ సినిమాల తర్వాత అల్లు అర్జున్ సినిమాతో అట్లీ టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు .. ఈ సినిమా స్టోరీ కూడా ఎంతో పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఉంటుందని చెబుతున్నారు.  ఈ సినిమాకు 400  బడ్జెట్ తో భారీ స్థాయిలో నిర్మించబోతున్నారట .


అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు మరో అగ్ర నటుడు కూడా నటించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ .. అల్లు అర్జున్  సినిమాలో శివ కార్తికేయన్ నటించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది .. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జంటగా జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది .. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. అమరాన్ తర్వాత శివ కార్తికేయన్ మద్రాసి , పరాశక్తి వంటి వరుస సినిమాలో నటిస్తున్నారు .. అలాగే ఈ సినిమాకు ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజముంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: