అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు. కానీ రీసెంట్ గా నాగచైతన్య నటించిన తండేల్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.


ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంకు చెందిన 22 మంది మత్స్యకారుల జీవితాలలో జరిగినటువంటి సంఘటనలను ఈ సినిమాలో అద్భుతంగా చిత్రీకరించారు. మత్స్యకారులు చేపల కోసం వెళ్లి పాకిస్తాన్ నేవీకి పట్టుబడడం, 14 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన అంశాన్ని తండేల్ సినిమాలో ఓ ఎమోషనల్ ప్రేమ కథగా నిర్మించారు. కాగా, ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించారు. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, బన్నీ వాసు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.


కాగా, ఈ సినిమా విడుదలైన మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమా మరో స్థాయికి వెళ్లిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం నాగచైతన్య డైరెక్టర్ కార్తీక్ దండుతో కలిసి మరో థ్రిల్లింగ్ సినిమా స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైనకి వెళ్లడానికి సిద్ధమైనట్టుగా సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య కార్తీక్ దండు సినిమా అనంతరం మరో ప్రేమ కథ స్టోరీతో రాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.


రీసెంట్ గానే ఈ సినిమా కథను అక్కినేని నాగచైతన్యకు చెప్పడంతో అతను ఓకే చెప్పారట. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక నాగచైతన్య ప్రస్తుతం తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ తీసుకున్నటువంటి ఫోటోలను నాగచైతన్య సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: