
‘పుష్ప 2’ ఘనవిజయం తరువాత సుకుమార్ తిరిగి రామ్ చరణ్ కాంబినేషన్ వైపు అడుగులు వేయడం ఖాయంగా మారింది. ప్రస్తుతం కథ విషయంలో తన టీమ్ తో ఆలోచనలు చేస్తున్న ఈ మూవీని ‘రంగస్థలం’ రేంజ్ కి మించి బ్లాక్ బష్టర్ హిట్ చేసే ఆలోచనలతో ఈ మూవీ కథను ఇంచుమించు ఫైనల్ చేశాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీలో చరణ్ పక్కన ఎవర్ని హీరోయిన్ గా తీసుకోవాలి అన్న ఆలోచనలలో సుకుమార్ దృష్టిలో రామలక్ష్మి సమంత ఉన్నట్లుగా లీకులు వస్తున్నాయి.
అయితే ఈ ఆలోచనలకు ఎంతవరకు చరణ్ ఓకె చెపుతాడు అన్న విషయం పై సమంత ఎంపిక ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు. ‘రంగస్థలం’ మూవీలో చిట్టిబాబు, రామలక్ష్మి కెమిస్ట్రీని క్లాసు మాస్ తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. మళ్ళీ అటువంటి క్రేజీ కాంబినేషన్ రిపీట్ చేయాలని సుకుమార్ ఆలోచన అని అంటున్నారు. నాగచైతన్యతో విడిపోయిన తరువాత సమంతకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడంలేదు.
‘పుష్ప’ లో ఐటం సాంగ్ సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా పాపులారిటీ విషయంలో ఇప్పటికీ సమంత ముందువరసలో ఉన్నప్పటికీ రష్మిక సాయి పల్లవి లాంటి క్రేజీ హీరోయిన్స్ ముందు సమంత నిలబడలేకపోతోంది. దీనితో ఈవిషయాలను పరిగణలోకి తీసుకోకుండా సమంతకు సుకుమార్ అవకాశం ఇస్తాడా లేదంటే తిరిగి రష్మిక వైపు సుకుమార్ అడుగులు వేస్తాడా అన్నది ప్రస్తుతానీకి సమాధానం లేని ప్రశ్నగా మారింది.
తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీని ఈ సంవత్సరం డిసెంబర్ లో మొదలుపెట్టి 2027 సంక్రాంతికి కానీ లేదంటే సమ్మర్ కు కానీ విడుదల అయ్యేలా సుకుమార్ ఆలోచనలు ఉన్నాయి అన్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో సందడి చేస్తున్నాయి. ‘గేమ్ ఛేంజర్’ మూవీ కోసం చాలకాలాన్ని వృధా చేసుకున్న చరణ్ మళ్ళీ అలాంటి పొరపాట్లు జరగకుందజాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. మరి చరణ్ ఆలోచనలు ఎంతవరకు కార్య దాలుస్తాయి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్..