నట సింహం నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే .. ఇప్పుడు ఈ సినిమా కి సీక్వల్ గా  ‘ అఖండ 2 – తాండవం ’ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి . అయితే ఈ సినిమా షూటింగ్ కూడా ఎంతో వేగంగా జరుగుతుంది .. అయితే వచ్చే వారం లో హిమాలయాల్లో కొన్ని కీలక ప్రదేశాల్లో బాలయ్య ఆ ఘోర పాత్ర పై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది .. గతం లో ఏ సినిమా లో చూడని విధంగా కొన్ని ముఖ్యమైన సన్నివేశాల ను చిత్రకరించేందుకు దర్శకుడు బోయపాటి భారి ప్లాన్ చేస్తున్నాడట .
 

అదే విధంగా ఈ సన్నివేశాల్లో బాలకృష్ణ తో పాటు జగపతి బాబు ,  అలాగే విలన్ పాత్రధారి కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది .. ఇక ఈ సినిమా ను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపీ ఆచంట నిర్మిస్తున్నారు . తమన్స్ సంగీత అందిస్తున్నారు .. బోయపాటి , బాలయ్య కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి .. ఇక దీంతో ఇప్పుడు అఖండ 2 తాండవ పై ఊహించని అంచనాల నెలకొన్నాయి .. బాలయ్య కూడా వరుస విజయాల తో దూసుకుపోతున్నాడు .. అసలే ఈ సినిమా ని పాన్ ఇండియా స్థాయి లో తెర్కకిస్తున్నాడు ..


ఈ సినిమాను ఉత్తరాది ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని బలంగా నమ్ముతున్నాడు బోయపాటి. పైగా శివుడి సెంటిమెంట్ కాబట్టి కచ్చితంగా ప్యాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ వస్తుందని నమ్ముతున్నారు. అఖండలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ అయితే.. సెకండ్ పార్ట్ కోసం సంయుక్త మీనన్ వచ్చింది. సెప్టెంబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం దాదాపు 130 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి బోయపాటి , బాలయ్య ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అలాంటి సంచనాల క్రియేట్ చేస్తారా చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: