ఇండియన్ చిత్ర పరిశ్రమ లో ఎంత ప్రతిష్టాత్మకంగా భావించే  ఐఫా  అవార్డుల వేడుక ఎంతో ఘనంగా జరిగింది .. పింక్ సిటీ జైపూర్ వేదికగా రెండు రోజులు పాటు ఈ కార్యక్రమం జరగక .. బాలీవుడ్ సినీ తారలు , రాజకీయ ప్రముఖులు సందడి చేశారు .   ఇందుకు సంబంధించిన  ఫోటోలు , వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవార్డులు వేడుక శనివారం ఎంతో ఘనంగా జరిగింది .. ఈ వేదికపై పంచాయత్, అమర్ సింగ్ చమ్కిలా సినిమాలు ఎక్కువ అవార్డులు గెలుచుకున్నాయి .. ఈ సంవత్సరం అవార్డుల వేడుకలకు బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ వ్యాఖ్యాతగా ఉన్నారు .. కరీనా కపూర్ 25 వ ఐఫా ఎడిషన్లో ప్రదర్శన ఇచ్చారు .. అలాగే ఆమె తాత దిగ్గజా చిత్ర నిర్మాత రాజకపూర్ కు అవార్డుల ప్రధానోత్సవం లో నివాళులర్పించారు.

ఆల్ఫా విజేతలు వీరే ..

ఉత్తమ చిత్రం: అమర్ సింగ్ (చమ్కిలా)

ఉత్తమ నటుడు: విక్రాంత్ మాస్సే (సెక్టార్ 36)

ఉత్తమ నటి: కృతి సనన్ (దో పట్టి)

ఉత్తమ దర్శకుడు : ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చమ్కిలా)

ఉత్తమ సహయ నటి : అనుప్రియ గోయెంకా (బెర్లిన్)

ఉత్తమ సహయ నటుడు : దీపక్ దోబ్రియాల్ (సెక్టార్ 36)

ఉత్తమ కథ ఒరిజినల్ (చిత్రం): కనికా ధిల్లాన్ (దో పట్టి)

ఉత్తమ సిరీస్: పంచాయత్ సీజన్ 3

ఉత్తమ నటి : శ్రేయ చౌదరి (బాండిష్ బాండిట్స్ సీజన్ 2 )

ఉత్తమ నటుడు : జితేంద్ర కుమార్ ( పంచాయత్ సీజన్ 3)

ఉత్తమ దర్శకుడు : దీపక్ కుమార్ మిశ్రా (పంచాయత్ సీజన్ 3)

ఉత్తమ సహయ నటి : సంజీదా షేక్ (హీరామండి: ది డైమండ్ బజార్)

ఉత్తమ సహయ నటుడు : ఫైసల్ మాలిక్ (పంచాయత్ సీజన్ 3)

ఉత్తమ కథ ఒరిజినల్ (సిరీస్): కోటా ఫ్యాక్టరీ సీజన్ 3

ఉత్తమ రియాలిటీ లేదా ఉత్తమ స్క్రిప్ట్ లేని సిరీస్: ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్

ఉత్తమ డాక్యుసీరీస్/డాక్యు ఫిల్మ్: యో యో హనీ సింగ్: ఫేమస్

ఉత్తమ టైటిల్ ట్రాక్: అనురాగ్ సైకియా (మిస్‌మ్యాచ్డ్ సీజన్ 3 నుండి ఇష్క్ హై )

మరింత సమాచారం తెలుసుకోండి: