పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కు రెడీ అయింది .. విడుదలకు ఒకవైపు అనుమానాలున్నప్పటి కీ సినిమా మాత్రం రెడీ అవుతుంది .. పవన్ సెట్స్‌ పైకి వస్తే పార్ట్ 1 న్ రెడీ అయిపోతుంది .. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ చూద్దాం . హరిహర వీరమల్లు సినిమా లో పవన్ కళ్యాణ్ కు జంట గా హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తుంది .. అలాగే ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ తో ఆమె కు ఎలాంటి రొమాంటిక్ సాంగ్స్ ఉండవు .. ఓ మిషన్ కోసం ఆమె కోట లో అడుగు పెడుతుంది తప్పించుకు నే మార్గం కోసం ఎదురు చూస్తున్న సమయం లో వీరమల్లు ఎదురుపడతాడు .
 

అలా వీరమల్లు సాయం తో కోట నుంచి నిధి అగర్వాల్ తప్పించుకుంటుంది .. అక్కడి తో ఆమె క్యారెక్టర్ అయిపోతుంది . మిగతాది పార్ట్ 2 లో చూపిస్తారు .. అలా హరిహర వీరమల్లు మొదటి భాగం లో నిధి అగర్వాల్ పోషించిన పంచమి పాత్ర అద్దాంతరం గా మాయమవుతుంది . ఇక ఈ సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్‌ ఊహించిని రేంజ్ లో ఉంటుంది .. ఇందులో గజదొంగ పాత్ర పోషిస్తున్న పవన్ ఓ పడవలో తీస్తున్న వజ్రాన్ని దొంగతనం చేయడానికి వస్తాడు ఆ పడవ ఓనర్ (మురళీ శర్మ) కు చెప్పి మరీ అతను దొంగతనం చేసే సీన్  హైలెట్ గా ఉంటుంది .. ఈ క్రమంలోనే పడవ పై వచ్చే ఫైట్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది .. ఇలా పవన్ వీరమల్లు సినిమా లో ఎన్నో గూస్ బంప్స్‌ సన్నివేశాలు ఉన్నాయి .. ఇక మరి పవన్ ఈ సినిమా తో బాక్స్ ఆఫీస్ ముందు ఎలాంటి అంచనాలను అందుకుంటారో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: