
ఇక ఈ స్థాయిలో కాకపోయినా నయనతార , సమంత లంటి హీరోయిన్లు కూడా కాస్త గట్టిగానే లాగుతున్నారు .. ఇక నయనతార విషయానికి వస్తే గతంలో ఆమె 6 కోట్లు తీసుకునేది .. అప్పట్లో సౌత్ లోనే అత్యధిక పారితోషం తీసుకున్న హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది .. ఇప్పుడు 10 కోట్ల వరకు తీసుకుంటుందట . సమంత విషయానికి వస్తే శకుంతల సినిమాకు ఈమె తక్కువగానే తీసుకుంది. ఇక ఖుషి సినిమాకు మాత్రం అటు ఇటుగా మూడు కోట్లు తీసుకుంది .. బాలీవుడ్లో సిటాడెల్ వెబ్ సిరీస్ గాను 8 కోట్ల వరకు వసూల్ చేసింది .. వీటి కంటే కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్ రక్త బ్రాహ్మండ్ సిరీస్ కోసం అందుకుంటుంది .. తన తర్వాత ప్రాజెక్టుకు సమంత పది కోట్ల వరకు తీసుకోవటం పక్క .
అనుష్క , రష్మిక కూడా భారీగానే పారితోషకం తీసుకొనే లిస్టులో ఉన్నారు .. అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు చేస్తుంది అనుష్క అలా అప్పుడప్పుడు చేసిన తను తీసుకునే ఫీజు మాత్రం మూడు నుంచి 6 కోట్ల వరకు తక్కువ కాకుండా ఉంటుంది . ఇక రష్మిక అయితే ఒక్కో సినిమాకు తన రేట్ పెంచుకుంటూ వెళ్లిపోతుంది .. పుష్పా2 సినిమాకు గాను 10 కోట్లు తీసుకుంది . అలాగే చావా సినిమాకు మాత్రం ఆమె 4 కోట్లు మాత్రమే తీసుకుందని టాక్ .. ఇలా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో నటిస్తున్న సికిందర్ కు ఈమె నాలుగు కోట్ల వరకు తీసుకుందట .. ఇలా ఈ విధంగా చూసుకుంటే సౌత్ హీరోయిన్ల కూడా తమ ఫీజులు ఈ మధ్య గట్టిగానే పెంచేశారు.