టాలీవుడ్‌ స్టార్‌ నేచురల్ స్టార్ నాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తనదైన నటన, సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నానికి యూత్ లో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. నాని తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం నాని యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కలిసి "ది ప్యారడైజ్" అనే సినిమాలో నటిస్తున్నారు.


"రా స్టేట్మెంట్" పేరుతో ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేశారు. "ఇది ల*జా కొడుకు కథ" అంటూ వచ్చిన ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటినుంచి ఈ సినిమా జోనర్, బ్యాక్ డ్రాప్ గురించి ప్రతిరోజు చర్చలు కొనసాగుతున్నాయి. 1980 సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో "ది ప్యారడైజ్" సినిమా రూపొందుతోంది. జమానాలో ప్యారడైజ్ హోటల్ ప్రాంతంలో నివసించే అణగారిన ప్రజల హక్కుల కోసం పోరాడే ల*జా కొడుకు కథను వివరిస్తుంది.


కాగా, ప్రస్తుతం "ది ప్యారడైజ్" సినిమా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రస్తుతం ఈ సినిమా నుంచి మరో షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఇందులో నాని ట్రాన్స్ జెండర్ గా కనిపించనున్నట్లు సమాచారం అందుతోంది. ఇటీవలే విడుదలైన గ్లింప్స్ లో రెండు జడలతో నాని ఊర మాస్ లుక్ లో కనిపించి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.


ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ సినిమాలో నాని ఇంత వరకు ఎప్పుడు నటించని విధంగా ట్రాన్స్ జెండర్ రూపంలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేయనున్నాడట. కాగా, ఈ సినిమా నుంచి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: