మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో వారు తెలియజేసినా సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.. అయితే మంచు విష్ణుకి ఆ రేంజ్ మార్కెట్ లేకపోవడంతో సినిమాపై పాన్ ఇండియా వైడ్ అంచనాలు పెంచడానికి ప్రతీ ఇండిస్ట్రీ నుంచి స్టార్స్ ని తీసుకోని కీలక పాత్ర లో నటింపజేయడం తో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 25 న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి, ఇప్పటికే విడుదలైన పోస్టర్స్,ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఇదిలా ఉంటే . రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల్లో మరింతగా అంచనాలను పెంచేసింది. అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో కొత్త అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు.. ఈ మూవీ నుండి లవ్ సాంగ్‌ను రెండో పాటగా మార్చి 10న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

కన్నప్ప జీవితంలో భక్తితో పాటు ప్రేమ కూడా ఉందని.. అది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చూపెట్టబోతున్నామని చిత్ర యూనిట్ తెలిపింది...మార్చి 10 న విడుదల చేయబోయే ఈ లవ్ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమాగా వున్నారు..మహాభారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా..స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందిస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: