మెగాస్టార్ చిరంజీవి ,డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో వస్తున్న చిత్రం విశ్వంభర. ఇప్పటికీ యంగ్ హీరోలకు దీటుగా చిరంజీవి తన చిత్రాలను పోటీ ఇస్తున్నారు. చిరంజీవి చిత్రాలలో కొత్తదనం లేకపోవడంతో కొంతమేరకు అభిమానులు నిరాశతో ఉన్నారు.. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని సోసియో ఫాంటసీ చిత్రమైన విశ్వాంభర చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా విజువల్ వండర్ గా తెరకెక్కిస్తూ ఉండారు. ఇందులో హీరోయిన్ గా త్రిష నటిస్తూ ఉండగా కీలకమైన పాత్రలో ఆషిక రంగనాథ్ కూడా నటిస్తూ ఉన్నది.



వీరితోపాటు మరికొంత మంది హీరోయిన్లు కూడా నటిస్తూ ఉండగా..UV బ్యానర్ పైన ఈ చిత్రాన్ని భారి బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉన్నప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ సైతం ట్రోల్ కి గురయ్యేలా ఉన్నాయి. దీంతో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేశారనే విధంగా కూడా వార్తలు వినిపించాయి. అయితే మెగా అభిమానులు మాత్రం విశ్వంభర సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు.


ఈ క్రమంలోనే ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది .సాధారణంగా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమాని పోస్ట్ ఫోన్ చేశారు. దీంతో ఈ సినిమా రిలీజ్ కి రెండు రిలీజ్ డేట్లను కూడా పరిశీలించినట్లు ఇండస్ట్రీలు గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఒకటి మే-9- 2025 కాగా.. మరొకటి ఆగస్టు 22వ తేదీ అని ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. ఆగస్టు 22న చిరంజీవి బర్త్డే కావున ఆరోజున రిలీజ్ చేస్తే బాగుంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి ఈ రెండు తేదీలలో విశ్వంభర సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: