
ఇక సంక్రాంతికి రావాల్సిన సినిమా విశ్వంభర.. రామ్ చరణ్ గేమ్‌చేంజర్ కారణంగా చిరంజీవి వెనుకడుగు వేయాల్సి వచ్చింది .. అలా సంక్రాంతికి మిస్ అయితే సమ్మర్ కి రావటం ఖాయమని అంతా అనుకున్నారు . మే 9న విశ్వంభర వస్తుందని ప్రచారం కూడా జరిగింది .. అయితే అప్పటికి కూడా ఈ సినిమా రిలీజ్ కాదని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి .. మరికొందరు ఆగస్టు వరకు ఈ సినిమా ఆగాల్సిందే అని అంటున్నారు .. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి .. ఆగస్టు కి షిఫ్ట్ అయితే సమ్మర్ ను చిరంజీవి మిస్ చేసుకున్నడు. అలాగే పవన్ హరిహర వీరమల్లు మార్చ్ 28 రావాలి కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు .. మరోవైపు ఆడపాదప ప్యాచ్ వర్క్ చేస్తూనే ఉన్నారు పవన్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉంది .. అయితే ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ అవుతాయో తెలియదు ..
వీఎఫ్ఎక్స్ కు ప్రాధాన్యం ఉన్న సినిమా కాబట్టి వాటికి సంబంధించిన వర్క్ కూడా చాలా వరకు పూర్తి కాలేదు .. పవన్ కాళీ బట్టి వీరమల్లు రిలీజ్ డేట్ ఆధారపడి ఉంటుంది .. ఏప్రిల్ వరకు ఈ సినిమా కంప్లీట్ అవద్దని ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ పబ్లిసిటీ పనులు మొదలు పెడతారు మే , జూన్ కూడా దాటిపోవచ్చు అనేది ఇన్సైడ్ వర్గాల మాట. అయితే ప్రభాస్ రాజా సాబ్ ది మరో బాధ .. రెండు పాటలు కొంత టాకీ వర్క్ మిగిలి ఉన్న సినిమా ఇది. ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామన్నారు కానీ ఏప్రిల్ రాజా సాబ్ రాదని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు . చిత్ర యూనిట్ జూన్ , జూలై వైపు చూస్తుంది .. ఇప్పుడు అది కూడా డౌట్ అని తెలుస్తుంది .. ఈ సినిమా మరింత ఆలస్యం అవుతుంది ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి .. ఈ విషయంపై చిత్ర యూనిట్ కూడా సైలెంట్ గా ఉంది . ఇలా ఈ సమ్మర్లో రావలసిన మూడు పెద్ద సినిమాలు ఇప్పుడు వాయిదాల బాటలో ఉన్నాయి .. ఇదే జరిగితే ఈ సమ్మర్లో ఆసలైన కిక్ లేనట్టే.. ఈ మూడు సినిమాలను పక్కన పెడితే బడా స్టార్ హీరో సినిమా ఏది ఈ సీజన్లో రావటం లేదు .. ఇక మీడియం రేంజ్ హీరోల సినిమాలు పెద్దదిక్కుగా అనుకోవాలి.