డబుల్ ఇస్మార్ట్ సినిమాతో భారీ షాక్ తిన్న‌ హీరో రామ్ కు బయటపడడానికి  ఎక్కువ టైమే పట్టింది .. అందుకే తర్వాత సినిమా మొదలు పెట్టడానికి కావాల్సినంత టైం తీసుకున్నాడు ఈ హీరో .. అలాగే మాస్ సినిమాలకు కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు .. ఎప్పుడో 2018 లో హలో గురు ప్రేమకోసమే అంటూ రొమాంటిక్ ఎంటర్టైనర్ రామ్‌ ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్, రెడ్ , వారియర్ , స్కంద, డబుల్ ఇస్మార్ట్ .. ఇలా వరుసగా మాస్ యాక్షన్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు .


వాటిలో ఇస్మార్ట్ శంకర్ తప్ప మిగిలిన వన్నీ ఈ హీరోకు గట్టి షాక్ ఇచ్చాయి .. అందుకే కొన్నాళ్లు కొట్టడాలు , నరుక్కోవడాలు పక్కనపెట్టి హాయిగా అమ్మాయిలు వెంట పూలు పట్టుకుని తిరగాలని ఫిక్స్ అయిపోయాడు రామ్ . ఈ క్రమంలోనే చాలా రోజులు తర్వాత ప్రెసెంట్ ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు ..మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి  లాంటి రొమాంటిక్ కామెడీ తెరకెక్కించిన దర్శకుడు మహేష్ బాబు తో ప్రస్తుతం రామ్‌ సినిమా చేస్తున్నాడు .. ఈ సినిమా కోసం తన లుక్ ను కూడా పూర్తిగా మార్చేశాడు. అలాగే ఈ సినిమాలోప్రజెంట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్గా నటిస్తుంది ..


ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది .. ఈ సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది .. ఇప్పటికే పిట్టపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే లైన్ బాగా ఫేమస్  అయింది .. అందుకే ఇప్పుడు రామ్ తన కొత్త సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ ను పెట్టబోతున్నారని అంటున్నారు .. కాకపోతే ఇది రొమాంటిక్ సినిమాకు ఇలాంటి టైటిల్ అనేది కొంత కొత్తగా ఉంటుంది .. ఒకవేళ ఇదే టైటిల్ ఫిక్స్ అయితే మాత్రం రామ్ సినిమాకు ప్రీ పబ్లిసిటీ అవ్వటం ఖాయం .. సమ్మర్లోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుందని అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: