
డైరెక్టర్ త్రినాధారవు నక్కిన ఒకపక్క నిర్మాత గా రెండు చిన్న సినిమాలు చేస్తున్నాడు .. మరో పక్క దర్శకుడు గా కోనేరు హనిష్ తో ఒక సినిమా ను మొదలు పెట్టాడు .. ఇక ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నాడు .. దిల్ రాజు సోదరుడు కొడుకు ఆశిష్ తో ఓ సినిమా కన్ఫర్మ్ అయింది .. ఆశిష్ ను ఎలాగైనా హీరో గా నిలబెట్టాల ని దిల్ రాజు ప్రయత్నం చేస్తున్నాడు .. అందుకే ఒక సినిమా తీశాడు .. అది ఎక్కలేదు .. రెండో సినిమా తీశాడు అది ఆడలేదు .. మూడో సినిమా కొంచెం తీసి పక్కన పెట్టాడు .. సుకుమార్ వీలు చూసుకుని దాని మీద దృష్టి పెడితే తప్ప అది పూర్తి కాదు ఎందుకంటే అది సుకుమార్ రైటింగ్స్ సినిమా .
ఆలో గా గతంలో తమ బ్యానర్ కు ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చి న త్రినాధరావు తో ఒక సినిమా ఓకే చేయించాడు . ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ సినిమా స్టోరీ త్రినాధరావు ది కాదు .. అలా అని బెజవాడ ప్రసన్న ది కూడా కాదు .. దిల్ రాజు సన్నిహితుడై న ఓ దర్శకుడు దగ్గర నుంచి తీసుకున్న కథ .. ఇప్పుడు అదే దర్శకుడు క్వాలిటీ కంట్రోల్ కూడా చేస్తాడు . 1980 బ్యాక్ డ్రాప్ లో నడిచే భారీ సినిమా ఇది .. కాస్త ఖర్చు ఎక్కువై నా ఓ మంచి ఈవెంట్ ఫిలిం తీసి వారసుడి ని నిలబెట్టాలని దిల్ రాజు గట్టి పట్టుదల గా ఉన్నాడు .. దీన్ని తర్వాత కరుణాకరన్ తో ఓ సినిమాని కూడా ప్లాన్ చేస్తున్నాడు .