తమిళనాట స్టార్ కమెడియన్ గా వెలుగొందుతున్నాడు రెడిన్ కింగ్స్లీ. 'కోలమావు కోకిల', 'డాక్టర్', 'జైలర్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో తన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. 40 ఏళ్లు పైబడ్డా సింగిల్ గానే ఉన్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, డిసెంబర్ 2023లో ఒక్కసారిగా సీరియల్ నటి సంగీతను పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. గుడిలో సింపుల్ గా వీరి పెళ్లి జరిగింది.

పెళ్లైన కొన్నాళ్లకే సంగీత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత రెడిన్ కింగ్స్లీనే స్వయంగా ఈ గుడ్ న్యూస్ చెప్పి తండ్రి కాబోతున్నందుకు ఫుల్ ఖుషీగా ఉన్నానని తెలిపాడు. ఇప్పుడు సంగీత డెలివరీకి దగ్గరలో ఉంది. ఈ సందర్భంగా ఆమె అదిరిపోయే మెటర్నిటీ ఫోటోషూట్ చేసింది.


సంగీత తన ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ లో రెడ్ డ్రెస్ లో అప్సరసలా మెరిసిపోతుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఒక ఫోటో మాత్రం అందరి కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు. ఆ ఫోటోలో సంగీత రెండు పోస్టర్లు పట్టుకుని కనిపించింది. అవేంటంటే.. ఒక పోస్టర్ లో సంగీత ఫోటో, ఇంకో పోస్టర్ లో రెడిన్ కింగ్స్లీ ఫోటో ఉన్నాయి. దీంతో వీళ్ళ బేబీ ఎవరి పోలికలతో పుడుతుందా అని చెప్పకనే చెబుతోందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే.. ఆ రెండు పోస్టర్లు చూడగానే.. సంగీత కడుపులో కవలలు ఉన్నారేమో అందుకే ఇలా పోస్టర్లు పెట్టి హింట్ ఇస్తుందా అని అనుకుంటున్నారు.

46 ఏళ్ల సంగీత అప్పట్లో విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. కానీ సీరియల్స్ ద్వారానే ఎక్కువ పాపులర్ అయింది. సన్ టీవీలో వచ్చిన 'ఆనంద రాగం' సీరియల్ లో విలన్ గా ఆమె చేసిన క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోయేలా చేసింది. ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

ఇప్పుడు ఈ కపుల్ తమ బేబీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్, నెటిజన్లు బెస్ట్ విషెస్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: