సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఎస్‌ఎస్‌ఎం‌బి 29 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ చిత్రంలో మహేష్ బాబు కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ప్రియాంక చోప్రా హైదరాబాద్ కు వచ్చి చిలుకూరు బాలాజీ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో పాటు హైదరాబాదులోని కొన్ని కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు. 

అదేవిధంగా మహేష్ బాబు ఫోటో ని లాక్ చేసి సింహాన్ని బోనులో బంధిస్తూ రాజమౌళి రిలీజ్ చేసిన ఓ వీడియోకు ప్రియాంక లైక్ చెయ్యడంతో పాటు కామెంట్ పెట్టారు. దీంతో సినిమాలో ప్రియాంక కన్ఫామ్ అన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆమె షూటింగ్ కు బ్రేక్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఎస్ఎస్ఎంబీ 29 లో మహేశ్ తో పాటూ పలువురు హీరోలు సైతం నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు గాసిప్స్ మొదలయ్యాయి.

మహేష్ బాబు పృథ్వీరాజ్ లు ఒరిస్సా ఎయిర్పోర్టులో పోలీసుకు షేక్ హ్యాండ్ ఇస్తున్న ఓ ఫోటో నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ వార్తలు నిజమే అనిపిస్తుంది. ఇక హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా తదుపరి ప్రాజెక్టును ఒడిశాలో ప్రారంభించింది. కోరాపుట్ జిల్లాలో ఉన్న పలు ప్రదేశాలలో చిత్రీకరణ జరుగుతోంది. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించడంతోపాటు ఇక్కడ పలు సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ షూటింగ్ పూర్తి అయ్యాక విశాఖపట్నం, శ్రీలంకలో షూటింగ్ జరుపుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇక తాజాగా మహేశ్ బాబు షూటింగ్ లో పాల్గొన్న ఓ వీడియో లీక్ అయ్యింది. ఈ సీన్ జక్కన్న సినిమాలోదే అని కొందరు అభిప్రాయపడుతుంటే మరికొందరు మౌంటేన్ డ్యూ యాడ్ కు సంబంధించినదని కామెంట్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: