
నటిగా వరుస సినిమాలలో బిజీగా ఉన్నప్పటికీ నటి అభినయ నిశ్చితార్థం చాలా రహస్యంగా చేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చెన్నై ప్రాంతానికి చెందిన ఈమె 2008లో దక్షిణాది భాషలలో ఎన్నో చిత్రాలలో నటించింది. తెలుగులో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత దమ్ము, సీతారామం, శంభో శివ శంభో, ధ్రువ తదితర చిత్రాలలో కీలకమైన పాత్రలో కూడా నటించింది. ఇటీవలే మలయాళం లో మంచి విజయాన్ని అందుకున్న పని సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది అభినయ. ఇందులో ఈమె నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు.
అయితే గత కొన్నేళ్లుగా హీరో విశాల్ తో ఈమె ప్రేమలో ఉన్నట్లుగా పలు రకాల రూమర్స్ వినిపించాయి. కానీ వీటన్నిటిని విశాల్ టీం క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు తాజాగా 15 ఏళ్లుగా తన చిన్ననాటి స్నేహితుడుతో ప్రేమలో ఉన్న అభినయ త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతోంది. అందుకు తగ్గట్టుగానే నిశ్చితార్థం కూడా చేసుకొని కొన్ని ఫోటోలను షేర్ చేయగా తన భర్త ముఖాన్ని మాత్రం పూర్తిగా రివీల్ చేయలేదు అభినయ. తన భర్త ఫేస్ ని ఎప్పుడు రివీల్ చేస్తావంటూ అభిమానులు, నేటిజన్స్ సైతం పలు రకాల కామెంట్స్తో వైరల్ చేస్తున్నారు.