టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అందం అభినయం వున్నా ఈ భామకి అదృష్టం కలిసి రాలేదు.. ఈ భామ మొదట బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయినా కానీ టాలీవుడ్ లో నాగచైతన్య నటించిన “సవ్య సాచి “ సినిమాతో పరిచయం అయింది.. ఆ సినిమాలో ఈ అమ్మడి అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.. ఆ తరువాత అఖిల్ హీరోగా నటించిన “మిస్టర్ మజ్ను” సినిమాలో హీరోయిన్ గా నటించింది.. కానీ ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది.. అయితే పూరీ జగన్నాద్, రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన “ఇస్మార్ట్ శంకర్సినిమా ఈ అమ్మడి కెరీర్ మార్చేసింది.. ఆ సినిమాతో ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ వచ్చాయి..

ప్రస్తుతం ఈ భామ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ హరిహర వీరమల్లు “ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ రాజాసాబ్ “ లో కూడా ఈ భామ హీరోయిన్ గా నటిస్తుంది.. పేరుకి భారీ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తున్నా ఆ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో క్లారిటీ లేదు.. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామకు మరో భారీ ఆఫర్ వచ్చింది..రీసెంట్ గా 'లక్కీ భాస్కర్' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి. ప్రస్తుతం స్టార్ హీరో సూర్యతో బిగ్ మూవీ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. సూర్యకి ముందు నుండి తెలుగులో డైరెక్ట్ సినిమా చేయాలని కోరిక ఉంది. మంచి కథ దొరికితే చేస్తానని చాలా ఈవెంట్‌లలో తెలిపాడు.

కాగా ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య సినిమా దాదాపు ఖరారైంది. ఈ విషయాన్ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్‌టైనమెంట్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం.. అయితే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉందని తెలుస్తుంది... ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే ను తీసుకునే ప్లాన్ లో ఉండగా, రెండో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: