తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నాని ఒకరు. ఈయన చాలా చిన్న హీరోగా కెరియర్ను మొదలు పెట్టి ఒక్కో విజయాన్ని అందుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటుడిగా కెరీర్ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నాని ఆఖరుగా సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం నాని , శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న హిట్ ది థర్డ్ కేస్ , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ మూవీలలో నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్న నాని ఆ తర్వాత రన్ రాజా రన్ , సాహో మూవీల దర్శకుడు అయినటువంటి సుజిత్ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి కమిట్ అయినట్లు తెలుస్తోంది.

సుజిత్ చాలా కాలం క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా ఓజి అనే మూవీన్ని స్టార్ట్ చేశాడు. ఇక పవన్ ప్రస్తుతం రాజకీయ పనులతో బిజీగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్ అత్యంత స్లోగా సాగుతుంది. నాని మరి కొంత కాలం లోనే హిట్ ది థర్డ్ కేస్ ,  ప్యారడైజ్ మూవీల షూటింగ్లను కంప్లీట్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ లోపు సుజిత్ "ఓజి" సినిమా షూటింగ్ను కంప్లీట్ చేస్తాడా లేదా అనే టెన్షన్లో నాని ఉన్నట్లు , హిట్ ది థర్డ్ కేస్ , ది ప్యారడైజ్ మూవీల షూటింగ్స్ కంప్లీట్ అయ్యే లోపు ఓజి సినిమా షూటింగ్ను కనుక సుజిత్ కంప్లీట్ చేసినట్లయితే వెంటనే నాని , సుజిత్ దర్శకత్వంలో మూవీ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఓజి మూవీ కి సంబంధించిన చాలా బాగా షూటింగ్ కంప్లీట్ అయినట్లు , పవన్ కొన్ని రోజుల సమయాన్ని కేటాయిస్తే ఓజి మూవీ షూటింగ్ మొత్తాన్ని సుజిత్ కంప్లీట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి నాని , సుజిత్ కాంబోలో మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: