నాచురల్ స్టార్ నాని కెరియర్ ప్రారంభం నుండి చాలా సంవత్సరాల పాటు క్లాస్ , డీసెంట్ , రొమాంటిక్ , ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలలో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటూ అద్భుతమైన స్థాయికి చేరుకున్నాడు. నాని కెరియర్ను మొదలు పెట్టిన తర్వాత చాలా సంవత్సరాల పాటు భారీ యాక్షన్ సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం నాని ఊర మాస్ సినిమాలలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది. కొంత కాలం క్రితం నాని "దసరా" అనే ఊర మాస్ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత నాని "హాయ్ నాన్న" అనే క్లాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే నాని "సరిపోదా శనివారం" అనే మరో ఊర మాస్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం నాని , శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా రూపొందుతుంది. నానిమూవీ తో పాటు ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ కూడా ఊర మాస్ మూవీగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ రెండు మూవీల నుండి వీడియోలను విడుదల చేయగా వాటి ద్వారానే ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత నాని , సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సుజిత్ కూడా వరుస పెట్టి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలను చేస్తున్నాడు. దానితో దానితో నానితో కూడా సుజిత్ యాక్షన్ సినిమానే చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా నాని వరుస పెట్టి ఊర మాస్ సినిమాలలో నటిస్తూ రావడంతో నాని ఎక్కువ శాతం మాస్ ఎంటర్టైనర్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: