దాదాపు ప్రతి వారం ధియేటర్లలో ఏవో సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. కానీ అలా విడుదల ఆయన సినిమాలలో అన్ని సినిమాలపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు ఉండవు. కొన్ని సందర్భాలలో ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేని సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో థియేటర్లు జనాలు లేక విలవిలలాడుతూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే పోయిన వారం , ఈ వారం తెలుగు సినిమా పరిశ్రమలో భారీ క్రేజ్ ఉన్న ఏ తెలుగు సినిమా కూడా విడుదల కాలేదు. ఇక దానితో ఈ మధ్య కాలంలో డబ్బింగ్ సినిమాల హవా తెలుగు సినీ పరిశ్రమలో పెరిగిపోయింది. కొంత కాలం క్రితం తమిళ డబ్బింగ్ సినిమా అయినటువంటి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తెలుగులో విడుదల అయ్యి మంచి కలక్షన్లను వసూలు చేసింది.

ఇప్పటికి కూడా ఈ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఇక తాజాగా హిందీ డబ్బింగ్ సినిమా అయినటువంటి ఛావా తెలుగులో విడుదల అయింది. ఈ సినిమా కూడా మంచి కలెక్షన్లను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. ఇక ప్రస్తుతం చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలు ఏవి థియేటర్లలో లేకపోవడంతో దిల్ రాజు కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ ని తాజాగా థియేటర్లలో రీ రిలీజ్ చేశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు , విక్టరీ వెంకటేష్ హీరోలుగా నటించిన సినిమా కావడం , అలాగే చెప్పుకోదగ్గ స్టేట్ తెలుగు సినిమాలు ఏవి ప్రస్తుతం థియేటర్లలో లేకపోవడంతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా భారీ కలెక్షన్లు దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇలా దిల్ రాజు సరైన సమయంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ ని రీ రిలీజ్ చేశాడు అని , అందుకే మంచి కలెక్షన్లు రీ రిలీజ్ లో భాగంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ కి వస్తున్నాయి అనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: