ప్రస్తుతం మన తెలుగు సినీ పరిశ్రమలో వరుస అపజయాల డీలా పడిపోయిన కొంత మంది హీరోలు ఉన్నారు. వారిలో కొంత మంది అర్జెంటుగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో కూడా ఉన్నారు. అలా వారు అర్జెంటుగా హిట్ కొట్టినట్లయితే వారి కెరియర్ డేంజర్ జోన్ లోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా అర్జెంటుగా హిట్టు కొట్టాల్సిన అవసరం ఉన్న టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసుకుందాం.

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో నితిన్ ఒకరు. నితిన్ ఈ మధ్యకాలంలో వరుస అపజయాలతో కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన రాబిన్ హుడ్ , తమ్ముడు అనే సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలలో ఏదైనా ఒక మూవీతో నితిన్ కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన మాస్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో గోపీచంద్ ఒకరు. గోపీచంద్ ఈ మధ్య కాలంలో వరుస అపజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ ఏ మూవీ చేయడం లేదు. కానీ గోపీచంద్ నెక్స్ట్ ఏ మూవీతో వచ్చిన ఆ మూవీతో మంచి విజయాన్ని అందుకుంటూనే ఆయన కెరియర్ సాఫీగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో రామ్ పోతినేని ఒకరు. ఈయన వరుసగా ది వారియర్ , స్కంద , డబల్ ఈస్మార్ట్ మూవీలతో ఫ్లాప్లను అందుకున్నాడు. ప్రస్తుతం ఈయన రాపో 22 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీతో ఈ నటుడు మంచి విజయం సాధించినట్లయితే మళ్లీ తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మాస్ మహారాజా రవితేజ ఆఖరుగా ధమాకా మూవీతో విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ప్రస్తుతం ఈయన మాస్ జాతర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీతో అయిన రవితేజ హిట్ కొట్టకపోతే ఈయన కెరియర్ కూడా డేంజర్ జోన్ లోకి వెళ్లే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: