టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన ముద్దుగుమ్మలలో రష్మిక మందన ఒకరు. కన్నడ సినీ పరిశ్రమ నుండి ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ నాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఛలో అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యే మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా ఈమెకు మంచి విజయాలు దక్కడంతో తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తెలుగు సినిమాల ద్వారా ఈమె ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం హిందీలో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. రష్మిక చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగడం మాత్రమే కాకుండా అదే రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

ఇంత గొప్ప స్థాయిలో రష్మిక కెరియర్ను ముందుకు సాగించడానికి ప్రధాన కారణం ఈమె సినిమాల ఎంపిక అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. రష్మిక ఇప్పటి వరకు చేసిన సినిమాలలో చాలా శాతం మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకున్నాయి. ఇక ఈమె రిజక్ట్ చేసిన సినిమాలలో చాలా శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దీని తోనే అర్థం అవుతుంది ఈ ముద్దుగుమ్మ సినిమాల ఎంపిక విషయంలో ఎంత క్లారిటీగా ఉంది అనేది. రష్మిక కి వరుస పెట్టి విజయాలు దక్కుతున్నాయి కాబట్టే అదిరిపోయే రేంజ్ క్రేజ్ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి అని , రష్మిక సినిమా ఓకే చేసింది అంటే అందులో ఎంతో కొంత విషయం ఉండి ఉంటుంది అని , అందుకే ఆమె నటించిన సినిమాలు మంచి విజయాలు అందుకుంటున్నాయి అని , అందుకే ఆమె స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగడం మాత్రమే కాకుండా అలాగే కెరియర్ను ముందుకు సాగిస్తుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: