టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లలో అనుష్క , సమంత , కాజల్ ముందు వరసలో ఉంటారు. వీరు ముగ్గురు కూడా చాలా సంవత్సరాల క్రితం కెరియర్ను మొదలు పెట్టి అత్యంత వేగంగా స్టార్ హీరోయిన్ల స్థాయికి చేరుకోవడం మాత్రమే కాకుండా ఇప్పటికి కూడా అద్భుతమైన రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. ఇకపోతే ఈ ముగ్గురు కూడా ఒక విషయంలో మాత్రం ఒకే ఆలోచనతో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. అది ఎందులో అనుకుంటున్నారా ..? ఐటమ్ సాంగ్స్ విషయంలో. వీరు ముగ్గురు కూడా ఐటమ్ సాంగ్స్ విషయంలో ఒకే ఆలోచనతో ముందుకు వెళ్లారు అదేమిటి అనేది తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే అనుష్క , మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన స్టాలిన్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ సాంగ్ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. దానితో అనుష్క వరుస పెట్టి స్పెషల్ సాంగ్స్ చేస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ స్టాలిన్ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతున్న ఇప్పటి వరకు అనుష్క "స్టాలిన్" మూవీ తర్వాత వేరే ఏ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయలేదు. ఇక కాజల్ అగర్వాల్ జూనియర్ , ఎన్టీఆర్ హీరోగా రూపొందిన జనతా గ్యారేజ్ మూవీలో ఐటమ్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. కానీ ఈమె కూడా జనతా గ్యారేజ్ మూవీ తర్వాత ఏ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయలేదు. సమంత , అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ లో ఐటమ్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ ద్వారా ఈమెకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమా విడుదల అయ్యి చాలా కాలమే అవుతున్న ఈ మూవీ తర్వాత సమంత ఇప్పటి వరకు ఏ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయలేదు. ఇలా ఈ ముగ్గురు కూడా స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలో ఐటమ్ సాంగ్స్ చేశారు. వాటి ద్వారా అద్భుతమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం మళ్ళీ స్పెషల్ సాంగ్స్ జోలికి వెళ్లకుండా కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: