తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన రవితేజ హీరోగా జ్యోతిక హీరోయిన్గా రూపొందిన షాక్ అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత మిరపకాయ్ , గబ్బర్ సింగ్ మూవీ లతో వరుస విజయాలను అందుకుని తెలుగులో అద్భుతమైన దర్శకుడిగా హరీష్ శంకర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. కొంతకాలం క్రితం ఈ దర్శకుడు మిస్టర్ బచ్చన్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ కి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హరీష్ శంకర్యువ హీరో సినిమాకు కథను అందిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి దిల్ రాజు సోదరుడి కుమారుడు అయినటువంటి ఆశిష్ రెడ్డి "రౌడీ బాయ్స్" అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ఈయన లవ్ మీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ఈ యువ నటుడి మూవీ కి హరీష్ శంకర్ కథను అందించబోతున్నట్లు , ప్రస్తుతం ఆ పనుల్లో హరీష్ శంకర్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక త్రినాథ్ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: