టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా షూటింగ్ సెట్లో సందడి చేసింది. డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. UV బ్యానర్ పైనే భారీ గాని నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ పైన ఇప్పటివరకు చిత్ర బృందం ఏ విధంగా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం అయితే అన్నపూర్ణ 7 ఎక్సర్ లో శరవేగంగా సినిమా షూటింగ్ జరుపుకుంటున్నరట ఈ క్రమంలోనే శ్రీలీల నటిస్తున్న ఒక సినిమా కూడా అక్కడే షూటింగ్ జరగడంతో మెగాస్టార్ చిరంజీవి కూడా అక్కడే ఉండడంతో ఈ అమ్మడు వెంటనే విశ్వంభర సినిమా సెట్ కి వెళ్లిందట.



దీంతో చిరంజీవి గారితో కొద్దిసేపు మాట్లాడి మహిళా దినోత్సవం సందర్భంగా తనను కలిసినందుకు శ్రీ లీల కి శాలువా కప్పి మరి సత్కరించి దుర్గాదేవి రూపంలో ఉన్నటువంటి ఒక శంఖాన్ని శ్రీలీల కు బహుమతిగా ఇచ్చారట. ఈ విషయాన్ని శ్రీలీల ఎంత ఎగ్జైటింగ్ గా తెలియజేస్తూ తన సోషల్ మీడియా వేదికపై చిరంజీవితో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ విత్ ఓజి వెండితెర పైన మనం ఎంతో ఆదరించేటువంటి శంకర్ దాదా ఎంబిబిఎస్ చిరంజీవి గారిని కలవడం చాలా ఆనందంగా ఉందంటూ తెలిపింది.


ఉమెన్స్ డే సందర్భంగా తనకు ప్రత్యేకమైన బహుమతి ఇచ్చారు అంటు అలాగే రుచికరమైన భోజనం వడ్డించారని స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్ అంటూ తన ఇంస్టాగ్రామ్ లో రాసుకుంది శ్రీలీల. ప్రస్తుతం శ్రీలీల షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. శ్రీలీల సినిమాల విషయానికి వస్తే రాబిన్ హుడ్, మాస్ జాతర, పరాశక్తి, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నది.. చివరిగా పుష్ప 2 చిత్రంలో స్పెషల్ సాంగ్లో అదరగొట్టేసింది శ్రీలీల.. దీంతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: