విక్కీ కౌశల్, రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం "ఛావా". ఈ సినిమాకు లక్ష్మణ్ ఓటేకర్ దర్శకత్వం వహించారు. గత నెలలో థియేటర్లలో రిలీజ్ అయిన ఛావా సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. శంబాజీ మహారాజ్ నిజ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమా కేవలం హిందీ భాషలో మాత్రమే రిలీజ్ అయింది. చత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంబాజీ మహారాజ్ వీరత్వం గురించి ఈ సినిమాలో చక్కగా రూపొందించారు.


ఛావా సినిమాలో విక్కీ కౌశల్ నటన చాలా అద్భుతంగా ఉందని అభిమానులు ప్రశంసలు కురిపించారు. కాగా, ఛావా సినిమా చాలా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయాలనే డిమాండ్స్ సైతం తెరపైకి అనేక విధాలుగా వచ్చాయి. దీంతో ఈ సినిమాను డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేయడానికి గీతా ఆర్ట్స్ సంస్థ ముందుకు వచ్చి తెలుగులో విడుదల చేసింది.


ఇక తెలుగులో రిలీజ్ అయిన ఛావా సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలైన 22 రోజుల్లోనే రూ. 502.7 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టినట్లుగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది. ఇక తెలుగులోనూ రిలీజ్ అయిన ఛావా సినిమా ఒక్కరోజులోనే రూ. 3 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమాలో రష్మిక, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలను పోషించారు.


కాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా....ప్రస్తుతం రష్మిక మందన టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది. తాను నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నాయి. దీంతో రష్మిక అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రీసెంట్ గా పుష్ప సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రష్మిక ఇప్పుడు ఛావా సినిమాతో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: