ఈ సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోఉ నటించిన సినిమాలు చాలానే విడుదల కానున్నాయి. మరి ఈ సంవత్సరం విడుదల కాబోయే స్టార్ హీరోల మూవీలు ఏవి ..? అవి ఏ నెలలో ... ఏ తేదీన విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.
హరిహర వీరమల్లు : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్గా రూపొందిన ఈ సినిమాను మే మొదటి వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
వార్ 2 : టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించాడు. తారక్ తో పాటు ఈ మూవీ లో హృతిక్ రోషన్ కూడా నటించాడు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
విశ్వంబర : మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్గా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఆగస్టు చివరి వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అఖండ 2 : బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఆర్ సి 16 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా అక్టోబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇలా ఈ సంవత్సరం ఈ ఆరు క్రేజీ సినిమాలు విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది.