నందమూరి బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా తన సినిమాలతో అభిమానులను తెగ ఆకట్టుకునేలా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వరుసగా నాలుగు సినిమాలు విజయాలను అందుకున్న బాలయ్య.. తన తదుపరిచిత్రం అఖండ 2 సినిమాలో నటిస్తూ ఉన్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్లో నడుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. డాకు మహారాజ్ సినిమా థియేటర్స్ కంటే ఎక్కువగా అఖండ 2 సినిమా ఓటిటీ డీల్ ఒక సెన్సేషనల్ గా మారిందట.



డాకు మహారాజు సినిమా వరల్డ్ వైస్ గా ఒక సరికొత్త ట్రెండు ని సెట్ చేసింది.. అందుకే బాలయ్య ,బోయపాటి కాంబినేషన్లో వస్తున్నటువంటి అఖండ 2  చిత్రాన్ని ఒక ప్రముఖ ఓటీటీ సమస్త తీసుకోవాలని పట్టుపడుతోందట. డాకు మహారాజ్ సినిమా కన్నడ, తమిళ్, హిందీ వర్షన్ లో కలిపి సుమారుగా 60 కోట్ల వరకు ఓటిటి డీల్ జరిగినట్లుగా వార్త వినిపించాయి. అయితే ఇప్పుడు ఏకంగా అఖండ 2 పాన్ ఇండియా లెవెల్లో పలు భాషలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో 80 కోట్ల వరకు ఈ సినిమాని ఓటీటీ డీల్  సెట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.


చాలా సంస్థలే అఖండ 2 డిజిటల్ హక్కులను సైతం తీసుకోవడానికి పోటీ పడుతున్నారట 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్న ఈ అఖండ 2 సినిమా ఓటిటి డీల్ సెట్ అయితే దాదాపుగా సగం బడ్జెట్ నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే కవర్ అవుతాయని అభిమానులు భావిస్తూ ఉన్నారు.. మరి కలెక్షన్స్ పరంగా ఏ విధంగా అఖండ 2 ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ఇందులో హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తూ ఉన్నది. అఖండ సినిమాలో నటించిన వారందరూ కూడా నటించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: