టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాలలో హీరో గా నటించి అందు లో కొన్ని మూవీ లతో మంచి విజయాలను కూడా అందుకున్నాడు . ఆఖరుగా ఈ నటుడు "క" అనే సినిమాలో హీరో గా నటించాడు . మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. ఈ మూవీ తో కిరణ్ కి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ నటుడు దిల్రుబా అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ ని మార్చి 14 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన దాదాపు అన్ని ఏరియాల థియేటర్ హక్కులను ఈ మూవీ బృందం వారు అమ్మివేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను మైత్రి సంస్థ వారు దక్కించుకున్నారు.

ఈ విషయాన్ని ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇకపోతే మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నైజాం ఏరియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. "క" లాంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత కిరణ్ నుండి వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: