
ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . వీళ్ళ కాంబోలో సినిమా వచ్చింది . అది జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది . అయితే జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో వార్ 2 సినిమా కూడా ఉంది . ఈ సినిమాతో ఆయన మరొక హిట్ తన ఖాతాలో వేసుకుంటాడు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈ సినిమా అయిపోగానే స్టార్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది .
ఈ మధ్యకాలంలో బోయపాటికి ఎవరు స్టార్ హీరోలు ఛాన్స్ ఇవ్వడం లేదు . ఫ్రెండ్షిప్ కారణంగానే బోయపాటికి ఛాన్స్ ఇచ్చాడు ఎన్టీఆర్ అని మాట్లాడుకుంటున్నారు జనాలు. అదే నిజమైతే మాత్రం ఎన్టీఆర్ ఖాతాలో మరో ఫ్లా కన్ ఫామ్ పక్కా అంటున్నారు జనాలు. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన సినిమాని బేస్ చేసుకుని రిజల్ట్ ముందుగానే అంచనా వేసేస్తున్నారు . ఆంధ్రావాలా టైపులో ఘాటుగా ఫ్లాప్ తారక్ ఖాతాలో పడబోతుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?? ప్రసెంట్ అయితే తారక్ పేరు మారు మ్రోగిపోతుంది..!