తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా , నిర్మాతగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను కూడా అందుకున్నాడు. అలాగే ఎన్నో మూవీలను నిర్మించి వాటిలో కూడా కొన్ని మూవీలతో మంచి సక్సెస్ లను కూడా అందుకున్నాడు. దానితో ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటుడిగా , నిర్మాతగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన కెరియర్ లో 21 వ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఇంత కాలం పాటు ఈ మూవీ కి టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ యొక్క షూటింగ్ను NKR 21 అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ పూర్తి చేస్తూ వచ్చారు. ఇకపోతే ఈ సినిమాలో విజయశాంతి ఒ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. చాలా రోజుల క్రితం ఈ సినిమాకు రుద్ర అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు , ఆల్మోస్ట్ దీనినే ఫైనల్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు రుద్ర అనే టైటిల్ ను కాకుండా అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే టైటిల్ను ఖరారు చేస్తూ అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం NKR  21 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిన కళ్యాణ్ రామ్ ప్రస్తుత సినిమాకు మేకర్స్ మొదట రుద్ర అనే టైటిల్ ని అనుకున్నప్పటికి , ఈ సినిమా కథ మదర్ సెంటిమెంట్ తో ఉండనున్నట్లు , దానితో అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే టైటిల్ ఈ మూవీ కథకు అద్భుతంగా సూట్ అవుతుంది అనే ఉద్దేశంతో రుద్ర అనే టైటిల్ ను కాకుండా అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే టైటిల్ మేకర్స్ ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nkr