మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన మూవీ దర్శకుడు అయినటువంటి బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మేకర్స్ ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ చరణ్ కెరియర్ లో 16 వ మూవీగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... శివ రాజ్ కుమార్ , జగపతి బాబు ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

వ్రీద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలమే అవుతున్న ఈ మూవీ షూటింగ్ మాత్రం కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. అందుకు ప్రధాన కారణం చరణ్ ఈ మూవీ కంటే ముందు గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో ఆర్ సి 16 సినిమా చాలా లేటుగా స్టార్ట్ అయింది. ఇక ఆ లోపు బుచ్చిబాబు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కాగా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టాక ఈ మూవీ షూటింగ్ జడ్జ్ స్పీడ్ గా కంప్లీట్ అవుతున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ మూవీ లో పెద్దగా విఎఫ్ఎక్స్ సన్నివేశాలు కూడా ఏమీ లేకపోవడంతో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యేక  చాలా తక్కువ కాలంలోనే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా చాలా త్వరగా విడుదల అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇలా ఈ మూవీ షూటింగ్ చాలా స్పీడ్ గా పూర్తి అవుతున్నట్లు వార్తలు రావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: