కోలీవుడ్ నటుడు విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకోవడంతో ఈయనకి కూడా తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇకపోతే తాజాగా ఈ నటుడు ధీర వీర శూర అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయనున్నారు.

ఇకపోతే ఈ మూవీ యొక్క తెలుగు హక్కుల భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా యొక్క తెలుగు హక్కులను ఎన్ వి ప్రసాద్ ఏకంగా నాలుగు కోట్ల ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ యొక్క తెలుగు హక్కులను భారీ ధరకు దక్కించుకున్న ఎన్ వి ప్రసాద్మూవీ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్లకు మించిన షేర్ కలెక్షన్లను వసూలు చేస్తేనే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

ఆ తర్వాతే ఈ మూవీ ద్వారా ఎన్ వి ప్రసాద్ కు లాభాలు వస్తాయి. మరి ఆ రేంజ్ లో షేర్ కలెక్షన్లను ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేయాలి అంటే కచ్చితంగా ఈ మూవీ మంచి తక్ రాబట్టుకోవాలి అని అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను రాబట్టి ఏ స్థాయి కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: