మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని సాహు గారపాటి నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో అనిల్ రావిపూడి ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులకు కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకొని షూటింగ్ను మొదలు పెట్టాలి అని ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కాగా పూర్తి చేసుకొని సినిమా షూటింగ్ను ఫుల్ స్పీడ్ గా కంప్లీట్ చేసి ఈ మూవీ ని ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలపాలి అని ఆలోచనలో అనిల్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే తాజాగా అనిల్ రావిపూడి , విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మొదలు పెట్టే ముందు కూడా అనిల్ రావిపూడి ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులకు చాలా సమయాన్ని తీసుకున్నాడు. ఇక సంక్రాంతికి కేవలం కొన్ని రోజుల ముందే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన సమయానికి సంక్రాంతికి మధ్య పెద్ద గ్యాప్ లేకపోవడంతో ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా లేదా అని అనుమానాలు చాలా మంది లో రేకెత్తాయి.

కానీ ఈ సినిమా షూటింగ్ మొదలు కాకముందే ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కాగా పూర్తి చేసుకోవడంతో ఈ సినిమాను జెట్ స్పీడ్ గా కంప్లీట్ చేసి ఈ మూవీ ని సంక్రాంతి పండక్కు విడుదల చేశాడు. ఇక అనిల్ , చిరు సినిమా విషయంలో కూడా ఇదే ఫార్ములాను పక్కాగా ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది. చిరుతో మూవీ ని సంవత్సరం మే లో మొదలు పెట్టి ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలి అని ఆలోచనలు అనిల్ రావిపూడి ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: