మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా  వున్నాడు.... గత ఏడాది ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. దాదాపు ఆరేళ్ళ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించాడు.. పార్ట్ 1 కు మంచి కలెక్షన్స్ రావడంతో మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ పార్ట్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..ఇప్పటికే దర్శకుడు కొరటాల శివసినిమా పార్ట్ 2 కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా వున్నాడు.. పార్ట్ 2 సినిమాను ఈ ఏడాది జులై లో షూటింగ్ మొదలు పెట్టి.. వచ్చే ఏడాది జనవరికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు..

అయితే ఈ సారి దేవర 2 లో ఊహించని ట్విస్టులు ఉండనున్నట్లు సమాచారం..కొత్త పాత్రల ఎంట్రీ కూడా ఉండనుందని సమాచారం..ఫస్ట్ పార్ట్ లో కథ నడిపించిన తీరు ఎంతో ఆసక్తికరంగా ఉండడంతో సెకండ్ పార్ట్ లో ఏం జరగబోతున్నదా అనే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్ మీద సుధాకర్ మిక్కిలినేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు..ఈ సినిమాలో మెయిన్ విలన్ బాబీ డియోల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.. అలాగే సినిమాలో ఫ్యాన్స్ ఊహించని ట్విస్టులు ఉండనున్నట్లు సమాచారం..

గతంలో ఎన్టీఆర్ కి చెప్పిన కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసిన కొరటాల.. పక్కా మాస్ స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం...అలాగే ఈ సినిమాలో ఇద్దరు యంగ్ హీరోలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి కీలక అప్డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది..




మరింత సమాచారం తెలుసుకోండి: