కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో కార్తీ ఒకరు. ఈయన చాలా కాలం క్రితం హీరోగా కెరియర్ను మొదలు పెట్టి ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన తాను నటించిన చాలా సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేశాడు. అలా ఈయన నటించిన చాలా మూవీ లు తెలుగులో విడుదల అయ్యి మంచి సక్సెస్ లను అందుకోవడంతో ఈ నటుడికి తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది.

ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం కార్తీ "ఆవారా" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో తమన్నా హీరోయిన్గా నటించగా ... లింగు సామి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తమిళ్ , తెలుగు రెండు భాషలలో విడుదల అయ్యి రెండు ప్రాంతాల్లో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా తమన్నా కు సూపర్ సాలిడ్ గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదట తమన్నా ను అనుకోలేదట. మరో ముద్దుగుమ్మను అనుకున్నారట. కానీ ఆమె ఆ పాత్రను రిజెక్ట్ చేయడంతో ఆ ఆఫర్ తమన్నా కి వచ్చిందట. ఈ విషయాన్ని ఆవారా సినిమా దర్శకుడు అయినటువంటి లింగు సామి తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

తాజాగా లింగు సామి మాట్లాడుతూ ... ఆవారా సినిమాకు సంబంధించిన కథ మొత్తం పూర్తి అయ్యాక ఆ సినిమాలో నయనతారను హీరోయిన్గా తీసుకుందాం అనుకున్నాం. అందులో భాగంగా ఆమెను వెళ్లి కలిసి కథను కూడా వివరించాను. ఆమెకు కథ కూడా బాగా నచ్చింది. ఆమె సినిమా కూడా చేస్తాను అంది. కానీ ఆ తర్వాత ఇతర కమిట్మెంట్ల కారణంగా ఆ సినిమాలో నయనతార నటించలేదు. దానితో తమన్నాను అందులో హీరోయిన్గా తీసుకున్నాం కానీ లింగు సామి తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: