మాస్ మహారాజా రవితేజ గత కొంత కాలంగా తన సినిమాలను సంక్రాంతికి విడుదల చేయాలి అని ప్రయత్నాలు చేసినా అవి పెద్దగా ఫలించడం లేదు. పోయిన సంవత్సరం సంక్రాంతి పండక్కు రవితేజ హీరోగా రూపొందిన ఈగల్ మూవీ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఆ తర్వాత ఆ సంవత్సరం సంక్రాంతి పండక్కు అనేక సినిమాలు విడుదలకు రెడీగా ఉండటంతో రవితేజ హీరో గా రూపొందిన ఈగల్ మూవీ ని సంక్రాంతి భరి నుండి తప్పించి ఆ తర్వాత విడుదల చేశారు.

ఇక ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండక్కు విడుదల చేయనున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మూవీ సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే మాస్ జాతర సినిమా తర్వాత రవితేజ , కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ మూవీ షూటింగ్లో మరి కొంత కాలం లోనే ప్రారంభించి ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కు విడుదల చేయాలి అని ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కు రవితేజ సినిమాను పక్కాగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు , ఎన్ని సినిమాలు పోటీగా ఉన్న ఎలాంటి పరిస్థితులు ఉన్న ఎన్ని సినిమాలు పొట్టిగా ఉన్న కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండగ బరిలో రవితేజ సినిమాలు నిలిపేందుకు మేకర్స్ గట్టిగా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే సంవత్సరం సంక్రాంతికి రవితేజ సినిమా ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉండడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: