
ఈ సినిమాతో మరొక 100 కోట్ల సినిమాని తన ఖాతాలో వేసుకోవడానికి రెడీగా ఉన్నాడు బాలయ్య. అయితే ఈ సినిమాలో ఆల్రెడీ ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుంది . కాగా ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా ఉంది అని ఆ క్యారెక్టర్ సినిమాకి హైలెట్ గా మారిపోతుంది అని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తూ వచ్చింది. కాగా ఈ సినిమాలో ఇప్పుడు ఆ క్యారెక్టర్ కోసం అన్షుని అనుకున్నారట. ముందుగా ఈ క్యారెక్టర్ కోసం హీరోయిన్ నయనతారను అప్రోచ్ అయ్యారట. ఆల్మోస్ట్ ఆల్ ఓకే అనుకున్న మూమెంట్లో "మజాకా" సినిమా రావడం ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం అందులో అన్షు నటన అద్భుతంగా ఉండడం.. మన్మధుడు సినిమా క్రేజ్ మరొకసారి ఆమె దక్కించుకోవడంతో సడన్గా మూవీ మేకర్స్ నయనతారను ఈ పాత్ర నుంచి తప్పిస్తూ అన్షును అప్రోచ్ అయి మరి ఈ పాత్రకు ఆమెను ఒప్పించేలా చేశారట .
అన్షు కూడా బాలయ్య సినిమాలో నటించడానికి ఒప్పుకుందట . ఈ పాత్ర సినిమానే తిరగరాసే క్యారెక్టర్ కావడం ఇక్కడ అన్షూ కెరియర్ ని హైలైట్ గా మార్చబోతుంది అంటున్నారు మేకర్స్ . కాగా బాలయ్య - అన్షూ కాంబోలో ఓ సినిమా వస్తుంది అని అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు జనాలు . అలాంటి ఒక కాంబో సెట్ అవ్వడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగానే ఉన్నారు . బోయపాటి శ్రీను తీసుకుంటున్న కొన్ని కొన్ని డెసిషన్స్ బాలయ్య కెరియర్ ఏదో లెవెల్ కి తీసుకెళ్ళి పోయాలానే ఉన్నాయి అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు..!