మహేష్ బాబు , వెంకటేష్ కలిసి న‌టించిన‌ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు .. రీసెంట్ గానే రీ రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది .. థియేటర్లో ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు .. ఇదే స‌మ‌యంలో ఈ సినిమాతో మరింత ఫేమస్ అయిన న‌టి అభినయ మరో గుడ్ న్యూస్ ను అభిమానులకు చెప్పింది .. ఈ సినిమాలో వెంకటేష్ , మహేష్ బాబుకు చెల్లిగా తెలుగు ప్రేక్షకులకు ఈమె దగ్గర అయింది .. తెలుగుతో పాటు తమిళం , మలయాళం భాషల్లో కూడా ఎన్నో సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది .. తాజాగా సోష‌ల్‌ మీడియా వేదికగా శుభవార్తను   పంచుకుంది . త్వరలోనే తను పెళ్లి చూసుకోబోతున్నట్లు .. సోషల్ మీడియాలో తన ఎంగేజ్మెంట్ ఫోటోను షేర్ చేసింది . అలాగే తనకు కాబోయే భర్త తో కలిసి గుడిలో గంట కొడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది.


మా ప్రయాణం నేటితో మొదలయ్యింది అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది .. అయితే తనకు కాబోయే భర్తను మాత్రం ఇంకా చూపించలేదు .. అలాగే అతనికి సంబంధించిన వివరాలు కూడా చెప్పలేదు .. ప్రస్తుతం అభినయ షేర్ చేసిన ఫోటో మాత్రం సోష‌ల్‌ మీడియాలో వైరల్ గా మారడం .. అభిమానులు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు .. అయితే కొన్నాళ్ల క్రితం హీరో విశాల్ తో అభినయ ప్రేమలో పడింది అంటూ వార్త‌లు కూడా వచ్చాయి . అలాగే త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం కూడా జరిగింది .. వీరిద్దరూ కలిసి పూజ, మార్క్ ఆంటోని వంటి సినిమాల్లో కలిసిన నటించడం తో అనేక రూమర్లు బయటికి వచ్చాయి.

 

అయితే త‌మ గురించి వస్తున్న వార్త‌లను విశాల్ , అభినయ ఇద్దరు ఖండించారు .. విశాల్ అంటే తనకు చాలా గౌరవమని ఆయనకు ఆరోగ్యం బాలేనప్పుడు పలకరించానని అంతకంటే తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని .. తాను తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమిస్తున్నట్లు చెప్పుకొచ్చింది .. అలాగే గ‌త‌ పదిహేనేళ్లుగా తనతో ప్రేమలో ఉన్నా ని అతడు తనను బాగా అర్థం చేసుకుంటాడని ఎలాంటి భయం లేకుండా అతనితో అన్ని విషయాలు చెప్పుకోగలనని . పెళ్లి చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది అని చెప్పుకొచ్చింది .. అయితే ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఫోటో షేర్ చేస్తూ తన పెళ్లికి సంబంధించిన వార్తను చెప్పేసింది  అభినయ .




మరింత సమాచారం తెలుసుకోండి: