
అదే సమయంలో ప్రియాంక కూడా చాలా పరిణితి చూపించింది .. అలాగే మానసికంగా ఎంతో బలంగా ఉండేదని ఎన్నో ప్రతికూల సమయాల్లోనూ అంతే ధైర్యంగా పలు నిర్ణయాలు తీసుకుందని ఆమె చెప్పుకొచ్చారు . అలాగే కెరియర్ మొదట్లో ఓ దర్శకుడు ఆమెకు కథ చెప్పడానికి వచ్చారు .. అయితే ఆ సమయంలో తన తల్లిని కారవాన్ నుంచి బయటకు వెళ్ళమని చెప్పాడట .. ఒంటరిగా చెబుతానని ప్రియాంక చోప్రాతో అన్నారట.
ఆ పరిస్థితిని ప్రియాంక ఎంతో ధైర్యంగా ఎదుర్కొందని .. అలాగే నా తల్లి పక్కన లేకుండా మీరు కథలు చెప్పలేకపోతే సినిమా చేస్తానని మీరు ఎలా అనుకున్నారు అంటూ ఘాటుగా అతనికి సమాధానం ఇచ్చింది . ఆ వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్లి పోయిందట .. అలాగే ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రియాంక కెరియర్ లో ఎన్నో చేదు ఘటనలు ఉన్నాయంటుంది ఆమె తల్లి .. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మహేష్ , రాజమౌళి సినిమా లో నటిస్తుంది .. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది .. ఇక త్వరలోనే ఆమె మరోసారి ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతోంది .