
ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకి రీ రిలీజ్ లో కూడా రెండు కోట్లకు పైగా గ్రాస్ వసూలు వచ్చాయి . రెండో రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి . వీటిని మొత్తం ఈ సినిమా క్యాష్ చేసుకొనేలా కనిపిస్తుంది ఇది మామూలు విషయం కాదనే చెప్పాలి. అయితే సాధారణంగా రీ రిలీజ్ సినిమాలకు వీకెండ్ లో మోస్తర్ కలెక్షన్ వచ్చి ఆ తర్వాత బజ్ తగ్గిపోతుంది . కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకు మాత్రం భిన్నంగా సూపర్ స్ట్రాంగ్ హోల్డ్ ను చూపిస్తుంది .. ఇప్పటికీ గతంలో రీ రిలీజైన పవన్ గబ్బర్ సింగ్ .. మహేష్ మురారి , విజయ్ దేవరకొండ ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలు మళ్లీ మంచి బిజినెస్ చేసుకున్న కానీ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మాత్రం ఇప్పటివరకు అందరి అంచనాల కన్నా ఎక్కువ రన్ కనబరుస్తుంది . తాజాగా ఈ సినిమా రీరిలీజ్ కలెక్షన్స్ పరంగా ఆరెంజ్ మూవీ ని దాటేసింది .. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ ఇటీవల రెండోసారి రిలీజ్ అయి 4.71 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది . కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మాత్రం రీ రిలీజ్ లో కేవలం మూడు రోజుల్లోనే 4.75 కోట్ల గ్రాస్ ను దాటేసింది . ఇదే వేగంతో సినిమా లాంగ్ రాన్లో మరింత హైయెస్ట్ నెంబర్స్ అందుకోవచ్చు అని కూడా ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఈ రికార్డులు అందుకోవడానికి ప్రధాన కారణం మహేష్ బాబు , వెంకటేష్ కాంబినేషన్ తో పాటు సినిమాలో ఉన్న ఎమోషనల్ కంటెంట్ కుటుంబ కథ సినిమాలకు ఉన్న క్రేజీ కారణంగా అన్ని వయసుల ప్రేక్షకులు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . మ్యూజికల్ గా కూడా ఈ సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ విజయంగా నిలిచింది .. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర మరోసారి కలెక్షన్ రూపంలో చూపిస్తుంది. ఇప్పటివరకు టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాస్ హైయెస్ట్ కలెక్షన్ల లిస్టు చూస్తే .. మురారి 4K – 8.90 కోట్లు ,గబ్బర్ సింగ్ 4K – 8.01 కోట్లు ,ఖుషి – 7.46 కోట్లు ,బిజినెస్ మాన్ 4K – 5.85 కోట్లు ,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – 4.75 కోట్లు (3 రోజులు) ,ఆరెంజ్ 4K – 4.71 కోట్లు (రెండో రీ రిలీజ్ – 1.35 కోట్లు) ,సింహాద్రి 4K – 4.60 కోట్లు ,ఈ నగరానికి ఏమైంది – 3.52 కోట్లు ,ఒక్కడు 4K – 2.54 కోట్లు, 7G బృందావన కాలనీ – 1.90 కోట్లు ... ఇకపోతే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇప్పటి వరకు వీకెండ్‌లో అద్భుతమైన రన్ చూపించినప్పటికీ , లాంగ్ రన్‌లో మహేష్ రీర్‌లో అత్యధిక రీ రిలీజ్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచే ఛాన్స్ కూడా ఉంది . ఇక మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఏ స్థాయిలో కలక్షన్ రాబడుతుందో చూడాలి.