బిగ్ బాస్ 9 కి ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టారు బిగ్ బాస్ టీం .. అయితే ఈసారి హోస్ట్ విషయంలో కచ్చితంగా మార్పు ఉంటుందని అంటున్నారు . బిగ్ బాస్ సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్నారు .. సీజన్ సీజన్ కి నాగార్జున హోస్టింగ్ అదిరిపోయింది .. కేవలం నాగార్జున కోసమే షో చూసేవాళ్ళు కూడా ఉన్నారు .. బిగ్ బాస్ సీజన్ వన్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. అసలు బిగ్ బాస్ ఎలా ఉంటుందో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది కూడా ఆయనే.

అయితే ఫస్ట్ సీజన్ అవ్వగానే మూడు నెలలు ఈ షోకి డేట్ ఇవ్వడం కష్టమని ఎన్టీఆర్ బిగ్ బాస్ ని వదిలేసాడు .. అయితే ఎన్టీఆర్ తర్వాత బిగ్ బాస్ 2 సీజన్ నాని హోస్ట్గా చేశాడు .. ఒక్క సీజన్ చేసేసరికి నాని బిగ్ బాస్ షో పై చిరాకు వచ్చేసింది .. ఇకమీదట ఎప్పుడూ ఆ షో వైపు చూడకూడదని ఫిక్స్ అయిపోయాడు .. అలాగే ఈ షో కారణంగా నానిపై ఎక్కువగా నెగెటివిటీ వచ్చేసిందంటే హోస్ట్ గా చేయడం వల్లే. ఎందుకంటే ఆ సీజన్లో నాని కొంతమంది కంటెస్టెంట్స్ కి ఫీవర్ గా ఉన్నాడని టాక్ బయటకు వచ్చింది .. ఈ గోళంత నాకెందుకు అని ఆయన సైలెంట్ అయిపోయాడు .. ఇక సీజన్ 3 నుంచి సీజన్ 8 వరకు నాగార్జున సింగిల్ హ్యాండ్ తో హోస్ట్గా చేస్తూ వచ్చాడు .. అయితే ఇప్పుడు నాగార్జున బదులుగా విజయ్ దేవరకొండ అని హోస్ట్‌గా తీసుకోబోతున్నారని టాక్ బయటకు వచ్చింది .. ఇక నాని ఎక్స్పీరియన్స్ చూసా కూడా విజయ్ దేవరకొండ ఇలాంటి రిస్క్ తీసుకుంటారా అంటూ చర్చ కూడా నడుస్తుంది.

ఇక నాని హోస్ట్గా చేసిన సమయంలో బిగ్బాస్ కంటెస్టెంట్స్ అభిమానులు నానిని భారీగా ట్రోల్ చేయటం మొదలుపెట్టారు .. అది ఊహించిన స్థాయికి వెళ్ళింది .  నాని కూడా ఆ నెగెటివిటీ భరించలేకపోయాడు .. అది చూసిన‌ విజయ్ దేవరకొండ హోస్ట్గా చేయాలని అనుకోవడం పెద్ద సాహసమే అని చెప్పవచ్చు .. అయితే ఇప్పుడు నాగార్జున బదులుగా విజయ్ దేవరకొండ ని ఒప్పించే ప్రయత్నంలో బిగ్బాస్ టీం ఉంది. ఇక బిగ్ బాస్ హోస్టుగా చేసేందుకు ఈసారి హోస్ట్ కి భారీ రెమ్యూనికేషన్ ఇవ్వబోతున్నారని టాక్ కూడా నడుస్తుంది .. దాదాపు 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారట .. అయితే నాగార్జున కాకపోతే ఆ స్థానంలో బిగ్ బాస్ హోస్ట్ గా ఎవ్వరిని చేస్తారా అన్నది షో మొదలయ్యే వరకు క్లారిటీ రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: