
మరొక పక్క సమంత ఫ్యాన్స్ కి ఘాటుగా మండిపోయేలా చేస్తుంది. అయితే నాగచైతన్య ఎక్కడా కూడా శోభిత ధూళిపాళ్లతో రొమాంటిక్ పిక్స్ బయటకి రావడం లేదు. సాధారణంగా సమంత - నాగచైతన్య ఎక్కడికి వెళ్ళినా చేతిలో చేయి పట్టుకొని వెళ్తారు . భుజంపై చేయి వేసుకొని వెళ్తారు . కానీ ఇప్పటివరకు నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ళ అలా ఒక్క సీన్లో కూడా కనిపించిన సందర్భాలు లేవు . దీంతో సోషల్ మీడియాలో ఇది ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. పెళ్లి తర్వాత సినిమాలకి ఫుల్ గా ఫుల్ స్టాప్ పెట్టేసింది అని టాక్ వచ్చింది.
కానీ అది ఫేక్ అంటూ రీసెంట్ గానే ప్రూవ్ అయ్యింది. కమిట్ అయిన సినిమాకి సంబంధించిన క్లిప్స్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి . అయితే ఇదే మూమెంట్లో శోభిత ధూళిపాల హీరో వరుణ్ తేజ్ తో సినిమాకి కమిట్ అయింది అన్న వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . వరుణ్ తేజ్ రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నాడు . లావణ్య త్రిపాఠి తో ఆయన మ్యారీడ్ లైఫ్ ఫుల్ హ్యాపీ గా ముందుకు వెళ్తుంది . ఆయన ..శోభిత తో సినిమా ఓకే చేశాడు అన్న విషయం వైరల్ గా మారింది . ఒక పెద్ద ఇంటికి కోడలతో ఒక పెద్దింటి హీరో పెళ్లి తర్వాత ఎలా ఇలా సినిమాని ఓకే చేశారు ...ఒక కమర్షియల్ సినిమా అంటే కచ్చితంగా అందులో కాస్తో కూస్తో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి..అప్పుడు ఎలా అంటూ జనాలు డౌట్ పడుతున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు జనాలు ఈ టాపిక్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఫిలిం సర్కిల్స్లో వరుణ్ తేజ్ -శోభిత ల పేర్లు వైరల్ గా మారుతున్నాయి..!