
అయితే ఇప్పుడిప్పుడే ఆ ట్రోలింగ్ నుంచి బయటపడుతున్న చిరంజీవికి మరొక బిగ్ మైనస్ పాయింట్ గా మారిపోయింది హీరోయిన్ సాయి పల్లవి అన్న వార్త వైరల్ గా మారింది . గతంలో సాయి పల్లవి - చిరంజీవి సినిమా ఆఫర్ రిజెక్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే . "భోలా శంకర్ " సినిమాలో కీర్తి సురేష్ పాత్రలో ముందుగా సాయి పల్లవిని అనుకున్నారట . కానీ ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేసింది . నాకు నచ్చని పాత్రను నేను చెయ్యను అంటూ ముఖానే చెప్పేసింది. అయితే ఇప్పుడు సాయి పల్లవి మరొకసారి మెగా ఆఫర్ ని తిరస్కరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .
మరొకసారి చిరంజీవి సినిమాను ఆమె రిజెక్ట్ చేసిందట . త్వరలోనే అనిల్ రావిపూడి - చిరంజీవి కాంబోలో సినిమా తెరకెక్కబోతుంది . ఈ సినిమాలో హీరోయిన్గా మన్మధుడు హీరోయిన్ అన్షు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది . అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం సాయి పల్లవి ని అనుకున్నారట మేకర్స్ . అనిల్ రావిపూడి రాసే క్యారెక్టర్ టైమింగ్స్ ఎంత బాగుంటాయో అందరికీ తెలిసిందే . అలా ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం సాయి పల్లవిని అప్రోచ్ అయ్యారట. అయితే సాయి పల్లవి మాత్రం రిజెక్ట్ చేసిందట . దానికి కారణం కాల్ షీట్స్ అంటూ తెలుస్తుంది . ఆమె ఈ క్యారెక్టర్ నచ్చినా కూడా రిజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ కాల్ షీట్స్ సరిగ్గా బాలీవుడ్ రామయణ కి కేటాయించిన మూమెంట్ లోనే ఉండడం ..ఆమెకు ఇబ్బందికరంగా మారిపోయిందట. ఆ కారణంగానే మెగా ఆఫర్ రిజెక్ట్ చేసిందట. లేకపోతే మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునేదట . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. సాయి పల్లవి మరొకసారి చిరంజీవి పరువు తీసింది అని కావాలనే ట్రోల్ చేస్తున్నారు మెగా హేటర్స్..!