
ప్రభాస్ - త్రిష ప్రేమించుకున్నారు అని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు అని సోషల్ మీడియా మొత్తం కోడై కూసింది . సినిమా ఇండస్ట్రీలోని స్టార్స్ కూడా ఈ జంట బాగుంటుంది అంటూ పలు సందర్భాలలో ఓపెన్ గా చెప్పకొచ్చారు. అలాంటి జంట ఎందుకు విడిపోయింది ..? అంటే మాత్రం రానా దగ్గుబాటితో - త్రిష నడిపిన డబుల్ ట్రాక్ అంటూ అప్పట్లో మాట్లాడుకున్నారు జనాలు . ఇవన్నీ పక్కన పడితే వీళ్ళిద్దరూ బ్రేకప్ చెప్పుకున్న తర్వాత వీళ్ళిద్దరిని కలిపి సినిమా తెరకెక్కించాలి అనే ఆలోచన వచ్చిన ఫస్ట్ డైరెక్టర్ మాత్రం రాజమౌళినే అంటున్నారు జనాలు .
రాజమౌళి ..బాహుబలి సినిమాలో హీరోయిన్గా త్రిషని అనుకున్నారట . ముందుగా ఆ విషయాన్ని ప్రభాస్ కి చెప్పారట . కానీ ప్రభాస్ ససేమీరా ఆమె హీరోయిన్గా నటిస్తే నేను సినిమా చేయనే చేయను అంటూ చెప్పేయడంతో ఆయన ఈ ప్రాజెక్టు నుంచి త్రిషని తీసేయాలి అంటూ డిసైడ్ అయ్యారట . అంతేకాదు ఆ తర్వాత "సాహో" సినిమాలో కూడా హీరోయిన్గా త్రిషని అనుకున్నారట డైరెక్టర్ . కానీ ప్రభాస్ సేమ్ ఆన్సర్ రిపీట్ చేయడంతో త్రిష ఉంటే సినిమాలో నటించను అని చెప్పడంతో డైరెక్టర్ త్రిష కాకుండా శ్రద్ధా కపూర్ ని హీరోయిన్గా చూస్ చేసుకున్నారట . అంతేకాదు ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాలో సైతం ముందుగా సందీప్ - త్రిషని అనుకున్నారట . కానీ ప్రభాస్ దగ్గర నుంచి ఈ ఆన్సర్ వస్తుందని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిన సందీప్ - త్రిష కాకుండా మరొక స్టార్ హీరోయిన్ ని ఈ సినిమాలో ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది . ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ - త్రిష కాంబోలో తెరకెక్కాల్సిన మూడు సినిమాల గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు..!