
ఇకపోతే కరోనా సమయంలో మొదలైన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో అవకాశాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది నిధి అగర్వాల్. ఒకవైపు ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే.. మరొకవైపు రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్ సినిమాలో కూడా అవకాశాన్ని అందుకుంది. ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈ అమ్మడికి మరొక అదృష్టం తలుపు తట్టింది అని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగులో నేరుగా సినిమా చేయాలని కలలు కంటున్న కోలివుడ్ స్టార్ హీరో సూర్య సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది నిధి అగర్వాల్.
ప్రముఖ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కాగా.. అందులో ఒకరు భాగ్యశ్రీ బోర్సే, మరొకరు నిధి అగర్వాల్ అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక మరొకవైపు వెంకీ అట్లూరి ఇటీవల లక్కీ భాస్కర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే . ఈ సినిమాతో ఇప్పుడు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు అటు సూర్య కూడా తన కోరికను నెరవేర్చుకోబోతున్నారు. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఇటు నిధి అగర్వాల్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.