
ఈఈవెంట్ లో నాని మాట్లాడుతూ ‘కోర్ట్’ మూవీ ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఒకవేళ ఆమూవీ ప్రేక్షకులకు నచ్చకపోతే తాను హీరోగా నటించి మరో రెండు నెలలలో విడుదలకాబోతున్న ‘హిట్ 3’ మూవీ చూడవద్దు అంటూ సవాల్ విసరడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. వాస్తవానికి హీరోలు తమ సినిమాను ప్రమోట్ చేస్తూ తమ సినిమా అందరికీ నచ్చుతుందని మితిమీరిన విశ్వాసంతో చెప్పిన సందర్భాలు చాల ఉన్నాయి.
అయితే అలా టాప్ హీరోలు తమ సినిమాల గురించి చెప్పిన మాటలు కొన్ని సందర్భాలలో వాస్తవ రూపం దాల్చలేకపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ నాని తాను నిర్మించిన ‘కోర్టు’ సినిమా బాగుంటుంది అని చెప్పడం సర్వసాదారణమే అయినప్పటికీ ఏకంగా తన సినిమా నచ్చకపోతే ఏకంగా తాను నటించిన ‘హిట్ 3’ మూవీ చూడవద్దు అని చెప్పడం నానీకి తాను నిర్మించిన కోర్టు మూవీ చూడవద్దు అంటూ అని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే వాస్తవానికి కోర్టు డ్రామా సినిమాలను మన తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆదరించరు. దీనికి ఉదాహరణగా గత సంవత్సరం విడుదలైన కొన్ని బాలీవుడ్ సినిమాలను పరిగణలోకి తీసుకోవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం బాలీవుడ్ లో హిట్ అయిన ‘దామిని’ మూవీ తెలుగులో డబ్ చేస్తే ఎవరు చూడలేదు. పవన్ మ్యానియా వల్ల ‘వకీల్ సాబ్’ ఎంతోకొంత నిలబడింది కానీ మరో హీరో చేసి ఉంటే ఆసినిమాకు అంతపెరు వచ్చి ఉండేది కాదు. అదేవిధంగా సప్తగిరి నటించిన జాలీ ఎల్ ఎల్ బి’ కూడ ఫ్లాప్ అయింది. దీనితో ‘కోర్ట్’ మూవీ పరిస్థితి ఏమిటి అన్న సందేహాలు ఎన్నో ఉన్నాయి..