ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ రెండు పడవల ప్రయాణం చేయడం కష్టం అంటారు. అయితే దీనికి భిన్నంగా సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తూనే హీరోగా కూడ సినిమాలు చేస్తూ ఇప్పటివరకు 25 సినిమాలలో  నటించినప్పటికీ హీరోగా పూర్తిగా నిలదొక్కుకోలేకపోతున్నాడు.



తెలుగులో కూడ ఇతడు సంగీత దర్శకత్వం వహించిన ‘డార్లింగ్’ ‘సార్’ మూవీల పాటలు హిట్ అయిన విషయం తెలిసిందే. ఇతడు ఇలాంటి పరిస్థితులలో ఒక హాలీవుడ్ రేంజ్ సినిమాలో హీరోగా నటించాలని చేసిన ప్రయత్నమే ‘కింగ్స్ టన్’ మూవీ. సముద్రం బ్యాక్ డ్రాప్ తో భారీ గ్రాఫిక్స్ సపోర్ట్ తో తీసిన ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున విడుదలైన ట్రైలర్ ను చూసి ఒక్కసారిగా ఈమూవీ పై భారీ అంచనాలు పెరిగాయి.



అయితే గతవారం విడుదలైన ఈమూవీని చూసిన సగటు ప్రేక్షకుడు ఈమూవీ బోర్ అంటూ తీర్పు ఇవ్వడం షాకింగ్ గా మారింది. అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన ఈమూవీకి ఇలాంటి ఫలితం ఎందుకు వచ్చింది అంటూ ఈమూవీని కొన్న బయ్యర్లు షాక్ అవుతున్నారు. తమిళనాడులో ఒక సముద్ర తీరం దగ్గర ఉండే ప్రజలు 43 సంవత్సరాలు వేటకు దూరంగా ఉంటారు. తాము చేసిన ఒక తప్పు వల్ల ఊళ్ళో జనాలు వరసగా చనిపోతున్నారని భావించి వారి కుల వృత్తి మానేసి చట్టవ్యతిరేక కార్యకలాపాలలో వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు.



అదే ఊరుకు చెందిన జివి ప్రకాష్ కుమార్ ఈసముద్ర రహస్యాన్ని బయట పెట్టడానికి చేసిన ప్రయత్నమే ఈసినిమా కథ. అంతుచిక్కని రహస్యంగా మారిన సంద్రం గుట్టును హీరో ఎలా బయటపెట్టాడు అన్నది సినిమా కథ. ఈ మూవీ దర్శకుడు కమల్ ప్రకాష్ కథను వ్రాసుకున్న తీరులో స్క్రీన్ ప్లేలో తడబాటు పడటంతో ఈమూవీ చూసిన సగటు ప్రేక్షకుడు పెదవి విరుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘కెజిఎఫ్’ ‘దేవర’ సినిమాల రేంజ్ లో మూవీ తీయాలని ఈ దర్శకుడు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో ఈమూవీ ఫెయిల్ అయింది అన్న వార్తలు వస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: