
ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవరాజు సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న ఈయన, ఇప్పుడు బాలీవుడ్లో హ్రుతిక్ రోషన్ తో ఢీ కొట్టడానికి వార్ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఈ సినిమాలో తొలిసారి నటించి బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఇక అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సెట్ లో ఎన్టీఆర్ కూడా పాల్గొనబోతున్నారు.
ఇక ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు ఈయన మరో కోలీవుడ్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు నెల్సన్ దిలీప్ కుమార్. రజినీకాంత్ తో జైలర్ సినిమా చేసి భారీ విజయాన్ని అందుకొని ఇప్పుడు జైలర్ సినిమా సీక్వెల్ షూటింగ్లో బిజీగా ఉన్న నెల్సన్ దిలీప్ కుమార్ తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాబోతున్న ఈ చిత్రానికి రాక్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. హై వోల్టేజ్ మాస్ యాక్షన్ పర్ఫామెన్స్ తో రాబోతున్న ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుందనటంలో సందేహం లేదు.