
ఈ చిన్నది ప్రస్తుతం తెలుగు, హిందీ అనే తేడా లేకుండా అక్కడ, ఇక్కడ వరుసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తోంది. అయితే ఈ బ్యూటీ వయసు 30 ఏళ్లకు పైనే ఉన్నప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోలేదు. కానీ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా ప్రతి ఒక్కరికి తెలిసిందే. వీరిద్దరూ తొందర్లోనే వివాహం చేసుకోవాలని నిర్ణయం కూడా తీసుకున్నారట. వివాహం తర్వాత కలిసి ఉండడానికి ఓ ఖరీదైన విల్లాను కూడా కొనుగోలు చేసినట్లుగా గతంలోనే జోరుగా వార్తలు వచ్చాయి.
అయితే తమన్నా, విజయవర్మకు సంబంధించి గత కొద్ది రోజుల నుంచి జోరుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయవర్మ, తమన్నా వారి రిలేషన్ కి ముగింపు పలికినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని సమాచారం అందుతోంది. అయితే ఈ వార్తలపై నటి తమన్నా తాజాగా స్పందించారు. ఇకనుంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని తమన్నా నిర్ణయం తీసుకున్నారట.
పెళ్లిళ్లు, ఎఫైర్లు, రిలేషన్స్ కి దూరంగా ఉండాలని తమన్నా అనుకుంటున్నారట. తమన్నా తన పూర్తి ద్యాసను కెరీర్ పైనే పెట్టాలని అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిని బట్టి తమన్న, విజయవర్మ నిజంగానే బ్రేకప్ చెప్పుకున్నారేమోనని జోరుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.